నా మనస్సు తెరిస్తే
ఓదార్పు లేని రోదనలు
లోకం మింగిన అవిటితనం
నా పగిలి వక్కలైన బ్రతుకు
గాజు పెంకులన్నీ నమిలివేశా
ఎవరికీ తెలియకుండా
పొట్టలో పోట్ల కడుపు నొప్పి
పేగుల్లో భూదేవి అంత ఆకలి
నేను అనేది వెర్రితనం ప్రశ్న
లేగదూడలు రాబందుల పాలు
గోచీలు లేని పిల్లలు రేపటి కాంక్రీటు బ్రతుకులు
లేబర్ ఆడపిల్లలు నెత్తినిండా అగ్నిపూలు
తిరుపతి వెంకన్నకు వెయ్యేళ్లు
ఆకలి చావుల సోమాలియా ఈ దేశం రేపు
దేవుళ్ళ శరీరాలు ముక్కలైనా అతుక్కుంటాయి
అన్నం తినలేక మాంసంలో మందుతో తాగుడు
పుట్టెడన్ని కష్టాలున్నా చెప్పక చెట్టు కొమ్మకు వేలాడే రైతు
వేటాడేందుకు కత్తి లేక గునపంతో పోరుబాట
ధరలు పెంచుతూ బదులుగా రక్తంతో కొనే కొలమానం
వీధుల నిండా చీపురు జుట్టు రంగూన్ రౌడీలు
నిరుద్యోగులు అడుక్కునే చిప్పలు సర్టిఫికెట్ లు
రాయాలంటే గుండె చెరువు రా తమ్ముడు,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట