మహా వనజాతరలో తొలి ఘట్టం కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లి ఆగమనం

తెలంగాణ కుంభమేళా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జన జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
దీంతో మేడారం అంత జనసంద్రంగా మారిపోయింది. భక్తులతో కిక్కిరిపోయింది మేడారం జాతర. ఆదివాసీల ఆచారాలతో నిండు పున్నమి వేళ బుధవారం రాత్రి 10.47 గంటలకు సారలమ్మ తల్లి గద్దెపై కొలువైన ఘట్టం కనుల పండువగా సాగింది. మేడారం జాతరలో తొలిఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులందరికి కనువిందు చేయటానికి సారలమ్మ గద్దెలపైకి చేరుకుంది. కన్నెపల్లి నుంచి అమ్మ ప్రతిరూపాలుగా భావించే, పసుపు-కుంకుమల భరిణలను మేడారంకు తీసుకొచ్చి గద్దెపైన ప్రతిష్ఠించారు పూజారులు. సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన కన్నెపల్లి ఆడపడుచులు అమ్మలను ప్రతిష్ఠించే గద్దె వద్ద శుద్ధి కార్యక్రమాలు చేశారు. భక్తుల కోలాహలం మధ్య సారలమ్మను తీసుకొచ్చారు పూజారులు. అమ్మవారి రాకను చూసేందుకు, సారలమ్మకు ఆహ్వానం పలికేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కనులపండువగా తిలకించారు.

కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం
గురువారం చిలకల గుట్టలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకు వస్తారు పూజారులు. సమ్మక్క తల్లికి ప్రభుత్వ లాంఛనాలతో ఆహ్వానం పలుకుతారు అధికారులు, మంత్రులు. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా పోలీసు అధికారి గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు..

20ఏళ్ల తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి రోజు.
అయితే ఈ ఏడా మరో ప్రత్యేకత ఉంది. రెండు దశాబ్దాల తర్వాత మేడారం జాతరలో అద్భుతం చోటు చేసుకుంది. గత రెండు దశాబ్దాలలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుధవారం రోజున సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో దేవతగా అవతరించింది. అందుకే ఆదివాసీలు ఆ మాఘశుద్ధ పౌర్ణమి రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే రోజే జాతర ప్రారంభించడం చాలా సందర్భాల్లో వీలుకాదని సమ్మక్క ఆలయ పూజరి కొక్కెర రమేశ్‌ తెలిపారు.

ప్రతిసారి బుధవారం జాతర ప్రారంభించడం మేడారంలో ఆనవాయితీగా వస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి, బుధవారం ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు. గత ఏడాది జాతర ముగిసిన రోజు వచ్చిందని సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్‌ తెలిపారు. Attachments area

ReplyForward
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular