కొందరు కలల కళ్ళు పీకేస్తారు
తెల్లవారినా కళ్ళు తెములుకోలేదు
కాపలా కుక్కలు అర్థరాత్రి అపరాత్రి కళ్ల గూర్ఖాలు
పెంటమీద వాలే కాకుల కళ్ళు నింగి నుండి టార్చ్ లైట్లు
కళ్ళు లేని కబోదికి భువి నిండా హరివిల్లులే
కళ్ళు తేలిపోయే ఆనందం పీకేసుకుంటేనే
ఏ సదృశ్యం లేని భువిపై కవి అభూత కల్పనలే
కళ్ళు లేని మురిక్కాలువల పక్క మూలిగే కుక్కలు తిండికై కయ్యాల లొల్లి
పనికట్టుకుని నింగి నిండా తిరిగే రాబంధులు మానవ వేటకే కళ్ళు
బజార్ల నిండా కళ్ళతో తిరుగుర్రా ఒక్కొక్కలిని ఖండఖండాలుగా నరకాలి
దయామయుల కళ్ళు పొడిచి దేవుడని పూజలు వ్రతాలు దీక్షలు
మనిషి కళ్ళు పబ్లిగ్గా విచ్చలవిడి శృంగారం చేస్తున్నాయి
వీధుల వెంట దేవుళ్ళ శవాల ఊరేగింపులు కళ్ళు మూసి చూడు
నిద్రలేని కళ్లల్లో దయ్యాలు పిశాచాల తిరిగే పైశాచిక ఆనందం
దేవుడికి వెర్రి తలలు దిగంతాల కావాల శూన్యం కప్పుకున్న చీకట్ల కబోది
ఆ జాబిల్లిని కళ్ళతో కోసి ముక్కలు చేసి పచ్చిమాంసం తిందాం వస్తావా కవి
వెర్రి ముదిరిన దున్నపోతు కవుల కళ్ళు ఆకలి తీర్చలేని వర్ణనలు
రెండు కళ్ళు పీకేసుకుని ప్రతివాడు కవే వాడికి సీతమ్మోరి కళ్ళు కార్చిచ్చులు
ఇంకేం రాయను నీ కళ్ళు వేలాడే గుమ్మానికి ఉరేయ్,,,,,,!
అపరాజిత్
సూర్యాపేట
