ప్రేమ ఆకర్షణ కాదు
రెండు హృదయాలు
వడబోసిన కలబోత
అటువంటి ప్రేమ అరుదు
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు
ఆ ప్రేమికులు ఎన్నటికీ విడిపోరు
నిజంగా విడిపోతే
సగం జీవితకాలం గతించితే
ఒకరికొకరు తారసపడితే
తమ ప్రేమ బలియైన పరిస్థితులు
తాము పెళ్లాడిన వ్యక్తులు
వాళ్ళు పడుతున్న బాధరాబందీ
తాము తమ సహచరులతో
పడుతున్న కన్నీళ్ళ అగాధాలు
తమ పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు
జీవిత భాగస్వాములతో
ప్రేమలు కరువైన యాంత్రిక జీవనం
సుఖదుఃఖాల పేకమేడలు
స్వేచ్ఛలు కరువై సర్దుకుపోలేని
కన్నీటి కడవల హృదయ లోగిలిలు
భాగస్వాముల వికృత మనస్పర్థలు
కొనసాగిస్తున్న ఎడారి జీవితం
హృదయం పగిలి బీళ్ళైన జీవితం
పిల్లలు తమను పట్టించుకుపోవడం
వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు
వాళ్ళ కాపురాలు
వాళ్ళ కలగాపులగం గొడవలు
తాము విడిపోవడానికి కారణాలు
ప్రేమలు చంపుకుని పెళ్ళిలైన స్థితి
జీవితంలో నిప్పులపై నడిచిన తీరు
తమకంటూ ఏమీ కోరుకొని
ప్రేమలు లేని అగాధాలు
ఈ సగం జీవితాల నరకయాతనలు
కన్నీటి పర్యంతమవుతూ
యుగాల దుఃఖాలన్నీ తమవే అన్న చందం
ఒకరికొకరు వీడ్కోలు పలుకుతూ
మరుజన్మలో నైనా
కమ్మనైన జీవితం పంచుకుందాం
ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకొని
ప్రాణం ఉగ్గబట్టుకుని
వాళ్ళ దారులు వేరై
వెళ్లిపోయే భగ్నప్రేమల
సుడిగుండాల విధిరాతలంతే మరి,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
