మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి
రైతులు తాము పండించిన ధాన్యం ఇంటికి తరలించిన సమయం
ఇంటింటా లక్ష్మీదేవి తాండవిస్తుంది
ధనిక పేద ప్రజల ఇళ్లల్లో ఈ చలికాలంలో వసంతాలు పూసే సమయం
ఆడపడుచులు ఇళ్ళ ముందు ముచ్చటగా ముగ్గులు తీర్చి
గొబ్బెమ్మలు ఆవు పేడతో చేసి తమ ఇంట్లోని నవధాన్యాలు, రేగుపళ్ళు, పిండికొమ్మలు, గరికపోసలతో ఇంటి గడపల ముందు పెట్టడమే కాకుండా,,,,,
ఇంటి గడపలను శోభాయమానంగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి బంతి చేమంతి పూవులు, మామిడాకులతో తోరణాలు కడతారు,,,,,,
తెల్లవారు జామునే భోగి మంటలు ఇంటి ముందు వేసి పిల్లలు పెద్దలు చలి తీవ్రత తగ్గుముఖం పట్టేందుకని చలికాచుకుంటూ భోగభాగ్యాల భోగిపండుగ చూడముచ్చటగా ఉంటుంది,,,,,,
ఇంటిల్లిపాది తలంటు స్నానాలు చేసి లక్ష్మీ పూజలు చేస్తారు,,,,,
ఈ పండుగ మూడు రోజులు ఇంటి ఇల్లాలు పిండివంటలు, గారెలు, బూరెలు, లడ్డూలు, తీయని పరువన్నం చేస్తారు,,,,,,
ఇంటిల్లిపాది ఒకేదగ్గర కూర్చొని భుజిస్తారు
కన్నుల పండుగగా భోగిపండుగ జరిపుకున్నాక
మరునాడు ఉదయం సంక్రాంతి లక్ష్మితో ఇల్లంతా కళకళలాడేట్లు ఇంటిముందు కళ్ళాపి చల్లి రథం ముగ్గులు వేసి లక్ష్మీ నారాయుణలును ఆహ్వానిస్తున్నట్లుగా,,,,,,,
ఇల్లాలు మంగళహారతులు పట్టి భర్తకు, పిల్లలకు సున్నితంగా కుంకుమ గంధాలు పెట్టి భక్తి గీతాలు ఆలపిస్తారు,,,,,
ఇంటిపెద్ద నాన్నగారు, తాత తమ పంట పొలాల ముందు పెట్టుకున్న దేవుని రాతి శిల్పం ముందు కోడిపుంజును బలియిచ్చి ఆ రక్తం కలిపిన పసుపు అన్నం పొలాలపై పొలిచల్లుతారు,,,,,,,
ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో వెలిగిపోవాలని దేవుడిని ప్రార్ధిస్తారు,,,,
కళకళలతో ఇంట్లోని వారంతా భోజనాలు, వంటకాలు ఆరగించి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు,,,,,,
ఆంధ్రలో కోడిపందాలు బెట్టులు కట్టి మరీ ఆడుతారు.ఇది ఈ రోజుల్లో విపరీతంగా మోజులు అయ్యాయి, విపరీత పోకడలు పోతోంది తగదు ఇల్లు ఒళ్ళు గుల్ల,,,,,,,,
కొందరు వ్రతాలు,నోములు బ్రాహ్మణులను పిలిచి తమ తమ ఇళ్ళల్లో దీక్షలతో జరుపుకుంటారు,,,,,,
సంక్రాంతి లక్ష్మీ రావమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా,,,,,,
కనుమ గోవులను అలంకరించి పూజించి మీరు కష్తించనిదే మాకు బువ్వ నోట్లోకి రాదమ్మా మీరు శివపార్వతులు మాకు అని తలుచుకుంటూ మంగళహారతులు పట్టి గోవుల కాళ్ళకు ఇంటిల్లిపాది దణ్ణం పెట్టుకోవడం విశేషం,,,,,,,
కుటుంబాలు తమకు కలిగిన కొలది నిరుపేదలు, అన్నార్తులకు దానధర్మాలు చేస్తారు
హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు బుడుబుక్కుల వాళ్ళు, పులివేశగాళ్ళు తమ శరీరాలను అలంకరణ చేసుకుని పండుగను ద్విగుణీకృతం చేసే గొప్ప విషయం,,,,,,,!!!?!!!
అపరాజిత్
సూర్యాపేట
